Tuesday, April 29, 2025
Navatelangana
Homeట్రెండింగ్ న్యూస్లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై పరశురాం

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై పరశురాం

- Advertisement -

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై ఎం. పరుశురాం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కేసులో ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆయన లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే, శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని తప్పించేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తిని కేసు నుంచి తప్పించడంతో పాటు, సీజ్ చేసిన అతని మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు గాను భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఫిర్యాదుదారు నుంచి రూ. 2 లక్షలు తీసుకున్నారు. అదనంగా మరో రూ. 22,000 ఇవ్వాలని ఫిర్యాదుదారుడిని డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు వ్యూహం పన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఫిర్యాదుదారుడు రూ. 22,000 నగదును ఎస్సై పరుశురాంకు అందజేస్తుండగా, మాటువేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. లంచంగా స్వీకరించిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు