Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్హాస్టల్ విద్యార్థులకు వాలీబాల్, నెట్, చెప్పులు బహుకరించిన ఎస్సై విక్రమ్ 

హాస్టల్ విద్యార్థులకు వాలీబాల్, నెట్, చెప్పులు బహుకరించిన ఎస్సై విక్రమ్ 

- Advertisement -

నవతెలంగాణ – నవాబు పేట
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నవాబుపేట ఎస్సై విక్రమ్ మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామంలో గల ప్రభుత్వ బాలుర సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఆవాసం పొందుతూ విద్యాభ్యాసం చేస్తున్న సుమారు 70 మంది నిరుపేద విద్యార్థులకు చెప్పులు, వాలీబాల్ నెట్ లను బహూకరించి తన ఉదారతను చాటుకున్నారు. మండల పరిధిలోని యన్మన్ గండ్లలో గల ఆ వసతి గృహంలో ఆవాసముంటూ విద్యాభ్యాసం చేస్తున్న నిరుపేద విద్యార్థుల దీనస్థితిని గురించి వసతి గృహం వార్డెన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ద్వారా తెలుసుకొని చలించిపోయిన ఎస్సై  తనకు తోచిన సహాయం చేసి వారికి అండగా నిలవాలని భావించి వెంటనే వారికి చెప్పులను అందించారు. అలాగే వారు క్రీడలు ఆడుతూ మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా వసతి గృహంలో ఆవాసం పొందుతూ విద్యాభ్యాసం చేయాలని ఉద్దేశంతో వారికి వాలీబాల్ నెట్ బహూకరించారు. హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా ఎస్సై సామాగ్రిలను పంపిణీ చేయడం పట్ల మండలంలోని పలువురు ఆయన ఉదాహరతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సురేష్ బాబు కానిస్టేబుల్ అశోక్  యన్మన్ గండ్ల గ్రామ యువకులు భరత్, ఎండి.రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad