Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిద్దిపేట గడ్డ.. హరీష్ రావు అడ్డా కాదు

సిద్దిపేట గడ్డ.. హరీష్ రావు అడ్డా కాదు

- Advertisement -

సిద్దిపేట గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తాం..
స్కాములు, స్కీముల పేరుతో బీఆర్ఎస్ భూస్థాపితం…
బిజెపి మెదక్ ఎంపీ  మాధవ నేని రఘునందన్ రావు..
నవతెలంగాణ – చిన్నకోడూరు 

స్కాంలు, స్కీములతో బిఆర్ఎస్ భూస్థాపితం కావడం ఖాయమని మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ప్రశ్నించారు. గురువారం చిన్నకోడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సేవా పక్షం మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు పురస్కరించుకొని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ పంపిణీ చేశారు. బస్టాండ్ ఆవరణంలో  మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడమే నరేంద్ర మోడీ లక్ష్యమన్నారు.

బీఆర్ఎస్ నాయకులు ఏ నాయకుడు ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారన్నారు. స్కాములు స్కీముల పేరుతో బిఆర్ఎస్ ప్రస్తానము ముగిసిందన్నారు. జీఎస్టీ బిల్లుతో పేద ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో జిఎస్టి బిల్లుకు ఆమోదం తెలుపలేధా..ఆని ప్రశ్నించారు. ఆనాడు ఒక మాట నేడు ఒక మాట మాట్లాడడం బీఆర్ఎస్ కు  చెల్లుతుందన్నారు. కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడాలన్నారు. సోషల్ మీడియాలో బిజెపిపై అసభ్యకర పోస్టులు పెడితే బీఆర్ఎస్ నాయకులను ఉరికించి కొడతామన్నారు. సిద్దిపేట హరీష్ రావు అడ్డా కాదన్నారు. 

సిద్దిపేట గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన చూశాక ప్రజలు కాంగ్రెస్ కు  మరో 20 ఏళ్ల పాటు అధికారం ఇవ్వరని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి జెండా ఎగరడం ఖాయమన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా లో  జెడ్పి సీట్లు ,ఎంపీపీ, ఎంపీటీసీ లతో పాటు సర్పంచులు కూడా మనమే గెలిచి చూపించాలన్నారు. వివిధ గ్రామాల బిఆర్ఎస్ కార్యకర్తలు ఎల్లాయిపల్లికి చెందిన తొట్ల నర్సింగం తో పాటు పలువురు  బిజెపిలో చేరారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు సురగొని శేఖర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పిట్ల పరశురాములు, బిజెపి నాయకులు వనజ, బాల్ నర్స్, బాపయ్య, మహేందర్ రెడ్డి,  సంతోష్, నాగరాజు, భూమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -