హాజరైన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ దంపతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల-మల్లారం ప్రధాన రహదారి ప్రక్కన వారణాసి హరిప్రసాద్ అనే వ్యాపారి నూతనంగా నిర్మాణం చేసిన ఎస్అండ్ఐకే కన్వెన్షన్ పంక్షన్ హాల్ ను సోమవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్-శైలజ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ.. ఈ కన్వెన్షన్ హాల్ నిర్మాణంతో తాడిచెర్ల, మల్లారం, చిన్నతూoడ్ల,పెద్దతూండ్ల తదితర గ్రామాల ప్రజలకు వివాహాలు, శుభకార్యాలయాలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, యూత్ అధ్యక్షుడు జగరి హరీష్, మాజీ జెడ్పిటిసి దంపతులు గొనె పద్మ-శ్రీనివాసరావు తోపాటు పలువురు పాల్గొన్నారు.
ఎస్అండ్ఐకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



