Monday, April 13, 2026
E-PAPER
Homeఆటలుఆయుష్‌కు సిల్వర్‌

ఆయుష్‌కు సిల్వర్‌

- Advertisement -

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌

నింగ్బో (చైనా) : భారత యువ షట్లర్‌, వరల్డ్‌ నం.25 ఆయుష్‌ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన భారత తొలి షట్లర్‌గా ఆయుష్‌ నిలిచాడు. ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో వరల్డ్‌ నం.2 షి యుకి (చైనా) చేతిలో ఆయుష్‌ శెట్టి వరుస గేముల్లో ఓటమి చెందాడు. 8-21, 10-21తో పసిడి పతకాన్ని చేజార్చుకున్నాడు. పసిడి పోరులో నిరాశపరిచినా.. ఆసియా బ్యాడ్మింటన్‌లో అద్భుత ప్రదర్శన ఆయుష్‌ శెట్టిని ప్రపంచ బ్యాడ్మింటన్‌కు పరిచయం చేసింది. వరల్డ్‌ నం.1 సహా టాప్‌-10 షట్లర్లు ఇద్దరిని ఓడించిన ఆయుష్‌ శెట్టి భారత బ్యాడ్మింటన్‌లో సరికొత్త కెరటంగా ఎదిగాడు. 1965లో దినేశ్‌ ఖన్నా ఆసియా బ్యాడ్మింటన్‌లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించగా.. 2026లో పసిడి పోరుకు చేరుకున్నా రజత పతకంతో ఆయుష్‌ శెట్టి చరిత్ర లిఖించాడు. మహిళల సింగిల్స్‌లో అన్సె యంగ్‌ (దక్షిణ కొరియా) చాంపియన్‌గా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -