గుర్తుండిపోయే సినిమా

3 గంటల క్రితం

memorable
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో నాని తన యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా ‘అలియాస్ రుక్మిణి’. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత దీప్తి గంటా మీడియాతో ముచ్చటించారు. చదువుతున్నప్పుడే ఈ కథ నచ్చింది. తర్వాత డైరెక్టర్ చెప్పిన నెరేషన్‌ను చాలా ఎంజాయ్ చేశా ను. అలాగే చాలా ఎమోష నల్‌గా ఉంది. ఇక దర్శకుడు ఈ కథను ముగించిన తీరు కూడా చాలా హత్తుకుంది. ప్రేక్షకులకు కూడా ఒక గొప్ప అనుభూతిని అందించ బోతోంది. ఈ కథకు నితిన్ అయితే బాగుంటుందని నాని చెప్పారు. నితిన్‌ కూడా ఈ కథ విని, సినిమా చేస్తానని చెప్పారు. కథ ఓకే చేసిన తర్వాత నాని ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఫైనల్‌గా సినిమా చూస్తారు.

ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. మురళి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తనకు ఇండస్ట్రీ లెక్కల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. తనకు ఏది రాయాలనిపిస్తే అది హానెస్ట్‌గా రాస్తారు. అంతే క్లారిటీగా తెరకెక్కిస్తారు. చాలా మంచి విజన్ ఉన్న డైరెక్టర్. రుక్మిణి అనే కలం పేరుతో తను కథలు రాస్తాడు. అసలు ఆ కలం పేరుతో ఎందుకు కథలు రాస్తు న్నాడు అనేది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సెన్సార్ జీరో కట్స్తో సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్ష‍కులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నితిన్‌ ఇప్పటివరకు కనిపించని పాత్రలో కనిపించి, సర్‌ప్రైజ్‌ చేస్తారు. ఆయన ది బెస్ట్‌ ఇచ్చారు. విజయ్ మంచి పాటలు ఇవ్వడమే కాదు, ఈ సినిమాకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్