Magazines

పాన్‌ ఇండియా స్థాయిలో దేశభక్తి సినిమా

18 నిమిషాల క్రితం

patriotic
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

అర్జున్ సర్జా ప్ర‌ధాన పాత్ర‌లో ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌పై అనూప్ మోహ‌న్ నిర్మాత‌గా భారీ బ‌డ్జెట్‌తో ఓ దేశ‌భ‌క్తి సినిమా రూపొంద‌నుంది. ఈ మూవీ నేడు (శుక్రవారం) శ్రీరామ జ‌న్మ‌భూమి అయోధ్య‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకోనుంది. అలాగే సినిమా టైటిల్‌ను కూడా ఇదే రోజు అనౌన్స్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అర్జున్ స‌ర్జా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా నిర్వ‌హించ‌నున్నారు. బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగస్వాములు కానున్నారు. అనూప్ మోహ‌న్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి జోస్ ఎం. థామస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగం, భారతదేశ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉండనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్