శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఓ టార్చర్ ప్రేమ’. ఈ చిత్రం లో మాదాల రంగారావు మనవడు మాదాల రవి అబ్బాయి సన్నీ మాదాల హీరోగా, మౌనిక వీర్ నాయికగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
శుక్రవారం ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
డైరెక్టర్, ప్రొడ్యూసర్ శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ,‘ఒక మంచి సినిమా చేసి మీ ముందుకు తీసుకొస్తున్నామని గర్వపడుతున్నా.
మా సినిమా పాటల్ని టీ సిరీస్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేసింది. మా మూవీని మైత్రీ డిస్ట్రిబ్యూ షన్స్ వంటి ప్రెస్టీజియస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఎలాంటి వల్గారిటీ లేని బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. అందరూ ఎంజాయ్ చేసే కామెడీ ఉంటుంది. ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ సినిమా అంత ప్యూర్ గా ఉంటుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమాకు వచ్చే క్రెడిట్ అంతా మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ శ్రీకర్ కృష్ణ కే దక్కాలి. మా మూవీ ప్రతి ఒక్కరినీ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాను’ అని హీరో సన్నీ మాదాల అన్నారు.
స్వచ్ఛమైన ప్రేమకథ...
3 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)