Magazines

నేటి తరానికి స్ఫూర్తిదాయకం...

21 నిమిషాల క్రితం

inspiration
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రి బాయి ఫూలే. మహిళా విద్యకు మార్గం చూపుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం వారు సాగించిన మహోన్నత పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే ‘ఫూలే’. దర్శకుడు అనంత్ నారాయణ్ మహ దేవన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే హిందీలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో నేడు (శుక్రవారం) థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సుపదా క్రియేషన్స్ బ్యానర్‌‌పై డా. పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించగా, ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు ప్రతీక్ గాంధీ మాట్లాడుతూ, ‘‘ఫూలే’ వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించడం ఎంతటి సవాలో, వాటిని మరింతమంది ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం కూడా అంతే పెద్ద బాధ్యత. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ముందుకొచ్చిన డా. రవిచంద్రకి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని అన్నారు. డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ, ‘ఈ సినిమాను గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. తెలుగు వెర్షన్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను రూపొందించాం. ప్రతి మహిళ తప్పక చూడాల్సిన చిత్రమిది. ప్రేక్షకుల్లో ఆలోచనను, స్ఫూర్తిని కలిగించే గొప్ప కథతో ఈ సినిమా రూపొందింది’ అని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్