‘రాజు వెడ్స్ రాంబాయి’ సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో ‘చంద్రయాన్’ టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియ దర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మించారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు.
గూగుల్ సాయంతో రాకెట్ తయారుచేసి చంద్రుడి మీదకు వెళ్లేందుకు నలుగురు కుర్రాళ్లు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆ రాకెట్ లో ఇంధనం కోసం తవుడు, ఆ వాతావరణంలో బతుకుతుందో లేదో టెస్ట్ చేసేందుకు కోడిని అద్దెకు తీసుకొస్తారు.
సైన్స్ కే ట్విస్టులు ఇచ్చే ఈ సైంటిస్టులు చేసే రాకెట్ ప్రయోగం ఊరికి కీడుగా గ్రామస్థులు భావిస్తారు. ఈ క్రమంలో ఊరిలో హత్య కేసు ఉదంతం వెలుగులోకి రావడం, బాబా భాస్కర్ క్యారెక్టర్ ను పరిచయం చేయడం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఎవరూ తమ ప్రయత్నాన్ని నమ్మని, ప్రోత్సహించని పరిస్థితుల్లో తమకు దొరికిన వస్తువులతో ఈ నలుగురు కుర్రాళ్లు రాకెట్ ఎలా తయారుచేశారు? చంద్రయానం ఎలా చేశారు? అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కరంగా సాగింది. ఈ సినిమాకి ఎడిటర్ - పుల్లారావు దాసరి, ప్రొడక్షన్ డిజైనర్స్ - శ్రీధర్ మేస్త్రి, మందర్ పస్నేకర్, డీవోపీ - శ్రీనివాస. బి., మ్యూజిక్ - హర్ష ప్రవీణ్.





కామెంట్లు (0)