Magazines

ఆద్యంతం వినోదభరితం...

13 నిమిషాల క్రితం

Entertaining
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

ఆర్విన్ తేజ్ హీరోగా, ‘జయమ్మ పంచాయితీ’ ఫేం విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాల 369’. ‘అటజని కంచె’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఆర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆర్విన్ తేజ్‌తో పాటు వెన్నెల కిషోర్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సమీరా భరద్వాజ్ జీవన్ పాత్రల చుట్టూ కథను నడిపించిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉంది. దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు పాత్రలను, సన్నివేశాలను చాలా నేచురల్‌గా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. కామెడీని సహజంగా చూపిస్తూ టీజర్ ఆద్యంతం వినోదాన్ని పంచుతోంది. ఈ చిత్రానికి అనుష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, డా. శాండీ సి. ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తికేయన్ రోహిణి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 27న గ్రాండ్‌గా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్