Magazines

శ్రీశైలం , జూరాలలో 53 టీఎంసీలే

14 నిమిషాల క్రితం

Srisailam and Jurala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మహబూబ్ నగర్
 ప్రాంతీయ ప్రతినిధి

కృష్ణానది ఆధారంగా నిర్మించిన శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి నీటి మట్టాలు పాతాళానికి పడిపోయాయి. శ్రీశైలంలో 885 అడుగులు ఉండాల్సిన నీటిమట్టం 829 అడుగులకు పడిపోయింది. 215 టీఎంసీలకు గాను 48.55 టీఎంసీలకు చేరింది. జూరాలలో 9.615 టీఎంసీల నుంచి 5.99 టీఎంసీలకు పడిపోయింది. జూరాల చివరి ఆయకట్టుతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో సాగుచేసిన వరి పంటలు ఎండిపోవడంతో మేత కోసం పశువులకు వదిలేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గుడిపల్లి. జొన్నల బొగుడ. ఎల్లూరు రిజర్వాయర్లు ఉన్నప్పటికీ ఎల్‌నినో ప్రభావం వల్ల నీరులేక వెలవెల బోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో 6వేలకు పైచిలుకు చిన్న పెద్ద చెరువులున్నాయి. ఈ చెరువుల్లోకి ఈ ఏడాది చుక్క నీరు చేరలేదు. మూడు రోజులకు ఒకసారి తాగునీటిని వదులుతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయమార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది.



​కరువు ప్రాంతంగా ప్రకటించాలి : వెంకట్రామి రెడ్డి, సీపీఐ(ఎం) నారాయణపేట జిల్లా కార్యదర్శి

ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి. పంటలు కాపాడుకోవడానికి రైతులు చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్