సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో, హీరోయిన్లుగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఐ హేట్ మ్యారేజ్'. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా నిర్మించారు. నేడు (శుక్రవారం) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు పరమేష్ రేణు కుంట్ల మాట్లాడుతూ, ‘ఈ మధ్య అమ్మయిలు సమాజంలో బాయ్ ఫ్రెండ్స్‌తో ఎం జాయ్ చేసి కూడా ఇంట్లో తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే చేసుకుంటున్నారు. అసలు ఎందుకిలా జరుగుతుంది?, అమ్మాయిలకు లవ్‌మీద క్లారిటీ లేదా?, పెళ్లి మీద నమ్మకం లేదా? తల్లిదండ్రుల మాటకు గౌరవం ఇస్తున్నారా అనేది అర్థం కాలేదు.
ఈ నేపథ్యంలో రీసెర్చ్ చేసి మరీ ఈ కథను రాశాను. ఇందులో తేలింది ఏంటంటే మ్యారేజ్ అంటే ఇష్టం లేని అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారని అనిపించింది. తల్లిదండ్రుల కోసమే మ్యారేజ్ చేసుకుంటున్నాం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమోషన్ లేని ఓ అబ్బాయితో తన సరదాలను తీర్చుకోవాలనే మైండ్‌సెట్ ఉన్న అమ్మాయి.. ఎలాంటి ఎమోషన్ లేని హీరో. ఈ ఇద్దరి కథ ఇది. అయితే ఇలాంటి అమ్మాయితో అనుకోకుండా ఎమోషనల్‌గా ఫీలయ్యి.. లవ్ చేయడం మొదలుపెడతాడు.. అమ్మాయికి కూడా ఇతని లవ్‌లో పడుతుంది. అప్పుడ ఏం జరిగింది అనేది కథ.. సినిమాలో బోల్డ్‌గా చూపించాలని కాదు. అలాంటి వారు మన సమాజంలో ఉన్నదే చూపించాం’ అని అన్నారు.







కామెంట్‌లు (0)