Magazines

మెప్పించే సిద్ధు ప్రేమకథ

22 నిమిషాల క్రితం

Siddu’s
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

మనోజ్, శృతి, మోహన సిద్ధి జంటగా నటించిన సినిమా ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో, సావిత్రమ్మ చెరుకూరు నిర్మించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వైవి రావు మాట్లాడుతూ, ‘యూత్ కు నచ్చే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అలాంటి కంటెంట్తో వస్తున్న మా సినిమా కూడ మీ అదరణ పొందుతుంది’ అని తెలిపారు. ‘యూత్ కు బాగా నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఇష్టపడతారు’ అని డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు చెప్పారు.

హీరో మనోజ్ మాట్లాడుతూ,‘ఇది ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయి. బీటెక్ చదివి సిటీలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని వెళ్లే యూత్ అందరూ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. నేను నా పర్సనల్ లైఫ్ లో అలాగే హైదరాబాద్ వచ్చాను. నగరానికి చేరుకున్న తర్వాత ఆ యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది మా మూవీలో చూపిస్తున్నాం. నేను ఈ సినిమాలో సిద్ధు క్యారెక్టర్ చేశాను. సాంగ్స్ అదిరిపోయాయి అంటున్నారు. మీకు బాగా కనెక్ట్ అయ్యేలా మూవీ ఉంటుంది’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్