ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేశా..

3 గంటల క్రితం

challenging
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో నాగచైతన్య నటించిన నూతన సినిమా ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్‌వీ సీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో హీరో యిన్ మీనాక్షి చౌదరి మీడియాతో సినీ విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ఇందులో నేను దక్ష అనే క్యారెక్టర్లో కనిపిస్తాను. డైరెక్టర్ కార్తిక్ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను డిజైన్ చేశారు. దక్ష చాలా ఫోకస్డ్‌గా ఉండే అమ్మాయి. తనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. తను ఆర్కియాలజీలో థీసెస్ చేస్తుంది. ఈ పాత్ర ప్రయా ణం చాలా ఆసక్తికరంగా ఉంటుం ది. ఈ క్యారెక్టర్‌కు చాలా మంచి గ్రాఫ్ ఉంది.


ఈ క్రెడిట్ మొత్తం అద్భుతంగా క్యారెక్టర్ రాసిన కార్తీక్కే దక్కుతుంది. నాకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయం. ఇందులో అలాంటి సీక్వె న్సులు ఉన్నాయి. నా కెరీర్‌లోనే ఓ ఛాలెంజింగ్‌ రోల్‌ చేశానని సంతృప్తిగా ఉన్నాను. నాగచైతన్యతో కలిసి రెండు రోజు లు వర్క్‌షాప్ చేశాం. డైరెక్టర్ విజన్ ఏంటి? దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? అనే విషయాలపై ఒక అవగాహనకు వచ్చాం. ‘వృషకర్మ’ వరల్డ్ చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. హర్రర్, మిథికల్ జోనర్‌లో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విజువ లైజేషన్, ట్రీట్‌మెంట్ అద్భుతంగా ఉంటాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్