Magazines

ప్రేక్ష‍కులు గుర్తు పెట్టుకునే పాత్ర చేశా

19 నిమిషాల క్రితం

I played a character that the audience will remember.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆకా శంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.

సాత్విక వీరవల్లి కథా నాయికగా పరిచయమవు తుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా ఈనెల 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరోయిన్ సాత్విక వీరవల్లి మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

నేను యూఎస్‌లో పుట్టి, పెరిగాను. ఇంజనీరింగ్, మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఒక సంస్థలో రెండేళ్లు ఇంజనీర్‌గా పనిచేశాను. క్రియేటివ్ రంగంలోకి వస్తే బాగుంటుందనిపించింది. మొదట ‘కాంత’ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. కానీ అందులో ఎంపిక కాలేదు. అదే ప్రొడ్యూసర్ మరో తమిళ సినిమా ఉందని చెప్పడంతో అందులో ఆడిషన్ ఇచ్చాను. ఆ సినిమాకు ఎంపిక కావడంతో ఇండియా వచ్చాను. కొన్ని రోజుల తర్వాత ‘ఆకాశంలో ఒక తార’ అవకాశం వచ్చింది. దీంతో నా ఉద్యోగాన్ని పక్కనపెట్టి నటన వైపు వచ్చాను.

ఇందులో నా పాత్ర నాకు చాలా ఇష్టం. చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. అయితే నా రియల్ లైఫ్ వ్యక్తిత్వం అలా ఉండదు. ఇందులో నా పాత్ర చాలా మృదువుగా మాట్లాడుతుంది. అంతరిక్షంలోకి వెళ్లాలన్నదే తన లక్ష్యం. చుట్టుపక్కల వాళ్లు తనను ఎంత కించపరిచినా, అవేవీ పట్టించుకోకుండా తన లక్ష్యం వైపే దృష్టి పెడుతుంది. ఈ క్యారెక్టర్ ప్రతి రంగంలో ఉన్నవారికీ ఉపయోగపడుతుంది.

దుల్కర్ నాకు చాలా సపోర్ట్ చేశారు. శ్రుతి హాసన్, రుహాని శర్మ అద్భుతమైన పెర్ఫార్మర్స్. అలాంటి వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా అనిపించింది.

నా జీవితంలో ఎప్పుడూ అనుభవించని ఒక పాత్రను ఎక్స్‌పీరియన్స్ చేయడం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అదే సినిమా ఇచ్చే మ్యాజిక్‌. నా పాత్రను ప్రేక్ష‍కులు కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారనే నమ్మకం ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్