Magazines

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్‌

16 నిమిషాల క్రితం

NTR under the direction of Anil Ravipudi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి మ‌నం చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌వ‌ర‌సాల్లో ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసే ఈ స్టార్ హీరో.. ఇప్పుడు కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా పేరున్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ ప‌వ‌ర్ ప్యాక్డ్‌ మూవీ చేయ‌టానికి రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, అనిల్ రావిపూడి వారి వారి అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అవి పూర్తి కాగానే ఈ సినిమాను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌, అనిల్ రావిపూడి క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ కాంబో మూవీకి సంబంధించిన‌ మరిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని టీమ్ తెలియ‌జేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్