Magazines

ఆద్యంతం వినూత్నం

11 నిమిషాల క్రితం

Innovative
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

'జయమ్మ పంచాయతీ’ ఫేమ్ విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో అర్విన్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బాల 369’. ‘అటజని కంచె’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. అర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మిస్తున్నారు. వైవా హర్ష సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నేడు (శుక్ర వారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ, ‘హర్ష ఈ సినిమాతో తను ప్రజెంటర్గా మారారు. ఆర్విన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాను. డైరెక్టర్ విజయ్ ఇంతకుముందు ‘జయమ్మ పంచాయతీ’ అనే అద్భుత మైన సినిమా తీశారు. ఈ రెండో సినిమాతో ఆయన పెద్ద కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌లోనూ, కంటెంట్‌లోనూ, నటీనటులందరిలోనూ పాజిటివిటీ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చాలా బ్రిలియంట్‌గా ఉంది’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్