హీరో కమల్ హాసన్ ప్రస్తుతం ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌కేఎఫ్‌ఐ), టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు.
తాజాగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్ గతంలో ఎన్నడూ చూడని రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి పవర్‌ఫుల్‌గా ‘సండియార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కమల్ హాసన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గ్రే గడ్డంతో, చిన్నగా కత్తిరించిన హెయిర్‌స్టైల్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. డార్క్ బ్రౌన్ షర్ట్ ధరించిన ఆయన ఓ వాహనం కిటికీకి ఆనుకుని, నేరుగా ముందుకు చూస్తూ ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తునారు.
ఆ వాహనంపై కనిపిస్తున్న రక్తపు మరకలు పోస్టర్‌కు రా అండ్ గ్రిట్టీ ఫీల్ తీసుకొచ్చాయి. వైలెన్స్ మధ్య సాగే ఓ బలమైన పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారనే ఆసక్తిని ఈ పోస్టర్ కలిగిస్తోంది.
‘సండియార్’ అనే టైటిల్ వినగానే భయంలేని, ధైర్యవంతమైన, శక్తిమంతమైన వ్యక్తి గుర్తుకొస్తాడు. కమల్ హాసన్ పోషిస్తున్న పాత్రకు ఈ టైటిల్ పర్ఫెక్ట్. ఆయన ఇంటెన్స్ లుక్, ప్రశాంతంగా కనిపిస్తూనే భయపెట్టే బాడీ లాంగ్వేజ్.. రాజీ పడని మనస్తత్వం, బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రను సూచిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్‌తోనే సినిమాలోని పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారు. దీంతో యాక్షన్‌తో నిండిన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
‘సేతుపతి’, ‘చిత్తా’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సునీల్ కె.ఎస్. సినిమాటోగ్రాఫర్, అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్, అమృతా రామ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
మరో పవర్‌ఫుల్ పాత్రలో కమల్..
49 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)