Magazines

‘కింగ్ 100’లో మహంతి ఝాన్సీ రాణి..

28 నిమిషాల క్రితం

Jhansi
avatar
balaji

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నాగార్జున అక్కినేని తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘కింగ్ 100’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండగా, రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను పరి చయం చేస్తూ మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె మహంతి ఝాన్సీ రాణిగా కనిపించనున్నారు. టబు పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభ మవుతుంది. ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. లక్క్ని నమ్మేవాళ్లు ఒకరు, హార్డ్ వర్క్ని నమ్మేవాళ్లు మరొకరు. ఐ హేట్ లక్’ అనే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఆత్మవిశ్వాసం, పవర్ ను పరిచయం చేశారు. 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మరోసారి తెరపై కలసి నటిస్తున్నారు. ఈసారి వారి కథ ప్రేమ చుట్టూ కాదు.. వార్ తో సాగనుంది. ఈ చిత్రం డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్