నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’. యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకుడు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16న ఈ సినిమా రిలీజ్ కు వస్తోంది. సోమవారం నటుడు నరేష్ విజయ కృష్ణ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ఇది హానెస్ట్ ఎంటర్టైనర్. బద్రప్ప, జగన్ మోహన్ రెడ్డి ఈ తరం దర్శక, నిర్మాతలు. దసరా పండుగ తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఈ పండుగకు ఈ సినిమాను థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా నాలుగు స్తంభాలాట లాంటిది. నేను, తరుణ్ భాస్కర్, అనుపమ, అఖిల్.. ఈ నలుగురి క్యారెక్టర్స్ నాలుగు ఫిల్లర్స్ లాంటివి. అందులో నా పాత్రకు ఇంకొంత ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఒక ఊరిలో మధ్య తరగతి కుటుంబంలో జరిగే కథ ఇది. తల్లి దండ్రులకు పిల్లలకు మధ్య జరిగే ఎమోషనల్ స్ట్రగుల్ ఈ మూవీలో ప్రధానాంశం. ఈ ఎమోషన్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. డైరెక్టర్ బద్రప్పను నేను కె విశ్వ నాథ్తో పోల్చాను. ఎందుకంటే ఆయన తన సినిమాల్లో నేటివిటీకి దూరంగా వెళ్లకుండా కొత్త దారిలో కథ చెబుతూ, పాత్రలకు ఒక కొత్త అర్థాన్నిస్తూ సినిమా రూపొందిస్తారు. ఆ పాత్రలకు ఒక మంచి ముగింపు ఇస్తారు. బద్రప్ప కూడా అలాగే చేశా డు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. నా పాత్రలో ఎమోషన్ తో పాటు ఫన్ ఉంటుంది. తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు పాత్ర ప్రతి ఊరిలో ఉంటుంది. ఊరిలో ఉండే ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయిని అను పమ పాత్ర ప్రతిబింబిస్తుంది.అలాగే అఖిల్ మంచి రోల్ చేశాడు.







కామెంట్‌లు (0)