Magazines

హీరో శ్రీకాంత్‌ కూతురు హీరోయిన్‌గా ‘#మైత్రీ ఇన్ లవ్’

1 గంట క్రితం

#Maitree In Love’
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

మైత్రీ మూవీ మేకర్స్ మరో ఆసక్తికరమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘#మైత్రీ ఇన్ లవ్’ గా రూపొందుతున్న ఈ చిత్రంతో ‘30 వెడ్స్ 21’, ‘మిడిల్ బెంచ్ రవి’ వంటి పాపులర్ వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన పృథ్వీ వనం ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు మహేష్ బాబు పి ఈ సినిమాకు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమా నిర్మాణంపై ఆసక్తితో ఫిల్మ్‌మేకింగ్, బిజినెస్ ఎకనామిక్స్‌లో విద్యను అభ్యసించిన జై జాస్తి.. ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండగా, హీరో శ్రీకాంత్, నటి ఊహ కుమార్తె మేధ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తనయుడు సాయి హర్ష ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం ఘనంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. సాహు గారపాటి, అర్చన కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకురాలు నందిని రెడ్డి క్లాప్ కొట్టారు. సౌమ్య యెర్నేని తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. జై జాస్తి, మేధ మేక జంటగా నటిస్తున్న ఈ సినిమాకి రచన, దర్శకత్వం: పృథ్వీ వనం, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, క్రియేటర్: మహేష్ బాబు పి, సహ నిర్మాత: అనిల్ యెర్నేని, సంగీతం: సాయి హర్ష.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్