Magazines

రజనీకాంత్‌ మార్క్‌ స్టయిల్‌తో ‘జైలర్‌ 2’

47 నిమిషాల క్రితం

Rajinikanth'
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

అగ్ర కథానాయకుడు నటిస్తున్న రజనీకాంత్‌ ‘జైలర్ 2’ ట్రైలర్‌ విడుదలైంది. తెలుగులోనూ విడుదలైన ఈ ట్రైలర్‌ హై-వోల్టేజ్ యాక్షన్, రజనీకాంత్ స్టైల్, కామెడీ, యాటిట్యూడ్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తనదైన క్విర్కీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘జైలర్’ ప్రపంచాన్ని మరింత పెద్దదిగా, మరింత ఆసక్తికరంగా ట్రైలర్‌ని తీర్చిదిద్దారు. ‘జైలర్’లో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఐకానిక్ క్యారెక్టర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మరోసారి తనదైన స్టైల్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించనున్నారు. సీక్వెల్‌లో మరింత పెద్ద సంఘర్షణ, భారీ స్థాయి సవాళ్లు, విస్తృతమైన ప్రపంచాన్ని ట్రైలర్‌ పరిచయం చేసింది. అలాగే ‘జైలర్’ను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టిన హ్యూమర్, మ్యాడ్‌నెస్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా కొనసాగిస్తూ ఈ సినిమా ఉండనుందని అని ట్రైలర్‌ చెప్పకనే చెప్పింది. ఎస్.జె. సూర్య, విద్యా బాలన్, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, యోగిబాబు నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ. ఆర్. నిర్మల్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈనెల 15న తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్