Magazines

నేషనల్‌ అవార్డ్‌ ఖాయం

1 గంట క్రితం

National Award is certain.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో సుహాస్ మరో కొత్త సినిమా‘హైడ్ అండ్‌ సిల్క్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజేంద్ర బాల దర్శకత్వం వహిస్తున్నారు. తమిళం, మలయాళంలో ఇప్పటికే 18 సినిమాలను నిర్మించిన స్టోన్ బెంచ్ స్టూడియో అధినేత కార్తికేయన్ సంతానం ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నాలుగు సినిమాలతో తెలుగులో తన నిర్మాణ ప్రయాణాన్ని ప్రారంభించనున్న ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం మిస్రిలాల్ పిక్చర్స్‌ వర్తికా జైన్‌తో చేతులు కలిపారు. ‘లబ్బర్ పందు’, ‘డీసీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంజన కృష్ణమూర్తి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సుహాస్ మాట్లాడుతూ, ‘‘పేట’ సినిమా చేసినప్పుడు కార్తీక్ సుబ్బరాజు, టీం కలిసి బాలాకు ఒక మాట ఇచ్చారు. తను సినిమా చేస్తే అందరం వచ్చి కలిసి పనిచేస్తామని చెప్పారు. ఆప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాం’ అని తెలిపారు.‘డైరెక్టర్ బాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చేశారు. ఇందులో ఎమోషన్స్, కామెడీ అన్నీ బాగుంటాయి. టీజర్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు అన్నారు. డైరెక్టర్ బాల మాట్లాడుతూ, ‘మనం మాట్లాడకూడదు, మన సినిమా మాట్లాడాలని మా గురువు కార్తీక్‌ సుబ్బరాజ్‌ చెప్తుంటారు. ఈ సినిమా కూడా మాట్లాడుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. ‘ఒక అద్భుతమైన టీమ్‌తో కలిసి ఒక పొయెటిక్ లవ్ స్టోరీని తీశారు. బాలా చాలా క్లారిటీతో తీశాడు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఖాయం’ అని తనికెళ్ల భరణి అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్