హీరో శర్వా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమాను
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
ఈనెల 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి అన్ని పాటలు రాసిన లిరిక్ రైటర్ చంద్రబోస్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘మల్లేశం’, ‘ఛాంపియన్’ సినిమాల్లో కూడా తెలంగాణ మాండలికంలో పాటలు రాశాను. కాకపోతే ‘భోగి’లో అత్యంత సహజమైన తెలంగాణ మాండలికంలో రాశాను. నేను చిన్నప్పుడు విన్నవి, మాట్లాడుకున్నవి, పరిశీలించిన మాటలను కూడా ఈ సినిమా ద్వారా రాసే అవకాశం వచ్చింది. ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది.
ఇది తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రం. ఆ జీవితాన్ని అత్యంత స్వచ్ఛమైన మాటల్లో, ఆ పరిభాష, యాసలో రాసే పనిలో సఫలమయ్యామని భావిస్తున్నాం. ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే బోలెడంత సంతోషంగా ఉంది.
సినిమా కవి ప్రతి మాండలికంలోనూ ఒదిగిపోవాలి. ‘రంగస్థలం’ సినిమాలో సుకుమార్తో కలిసి గోదావరి మాండలికంలో పాటలు రాశాను. అలాగే ‘పుష్ప’లో చిత్తూరు యాస పరిశీలించి రాశాను.
డైరెక్టర్ సంపత్ నందికి కవిత్వం, పాటలు, సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. ‘ఎగిలివారంగ’ పాటలో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆ దినచర్య ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశాం. ఆ రోజుల్లో ప్రజల జీవితాలు ఎలా ఉండేవి? వాళ్లు ఎవరి ఏలుబడిలో ఉండేవారు? వాళ్లను ఎవరు కట్టడి చేసేవారు? అవన్నీ కూడా కళ్లకు కట్టినట్టుగా సాహిత్యంతో చెప్పడం జరిగింది. అందుకే చాలామంది పర్సనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. తమ ఊరిలో ఉన్నట్టుగా ఉందని భావిస్తున్నారు.
ఇది అందరికీ చెందిన కథ. కొన్ని ఏళ్ల క్రితం గ్రామాల్లో ప్రజల జీవితం ఎలా ఉండేది, ఎలా జీవించేవారు అనే విషయాలను ఇందులో చూపించాం. అందుకే అన్ని ప్రాంతాల వారికి ఇది కనెక్ట్ అవుతోంది. ఈ కథలోని సంఘర్షణ, భావోద్వేగం అందరికీ కనెక్ట్ అవుతాయి.
తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రం
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది నవం 21, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)