98వ ఆస్కార్ అవార్డుల వేదికపై భారతీయ సినిమాలు మరోమారు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ‘గోంధల్’, ‘అంగ్’ వంటి భార తీయ చిత్రాలు ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో పరిశీలనకు ఎంపికవ్వగా.. ఇప్పుడు మరో లఘుచిత్రం కూడా అకాడమీ పరిశీలనకు అర్హత సాధించింది. ఈ సినిమాను రూపొందించిన దర్శకు రాలితో పాటు ప్రధాన పాత్రలో నటించిన నటి కూడా తెలుగువారే కావడం వివేషం. , తెలుగు, కన్నడ నేపథ్యంతో తెరకెక్కిన ‘పంకజ’ అనే ఈ షార్ట్‌ఫిల్మ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. చిన్న ప్రాజెక్టుగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఆస్కార్ వరకు చేరింది. ఈ చిత్రానికి అనూయ స్వామి దర్శకత్వం వహించగా, హర్షిణి బోయళ్ల ప్రధాన పాత్రలో నటించారు. వీరిద్దరూ బెంగళూరులో పుట్టి పెరిగిన తెలుగువారే కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






కామెంట్‌లు (0)