ఇంక్ స్పైర్ స్టూడీయోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘కూల్ రాఖీ కూల్’. ఈ సినిమా పోస్టర్స్, టైటిల్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహ్మద్ సాయిద్ సమి రచన, ఎడిటింగ్, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని చిత్రయూనిట్ వెల్లడించింది. హీరో, దర్శకుడు, నిర్మాత, రచయిత, ఎడిటర్‌గా అన్ని బాధ్యతలు సమి ఒక్కరే నిర్వహించడం గొప్ప విషయమని అతిథులు అభినందించారు. దర్శకుడు, హీరో సమి మాట్లాడుతూ, ‘ఇది మా ఫ్రెండ్స్ నిజమైన కథ. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న రిలేషన్ షిప్స్, లవ్ స్టోరీలు, ఘోస్టింగ్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. వాటి నేపథ్యంలో తీసిన ఈ సిమాకి యూత్ అంతా కనెక్ట్ అవుతారని 100% కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమాలో 18+ సీన్స్, అడల్ట్ డైలాగ్స్ ఉండటానికి కారణం మనిషికి ఎమోషన్ వచ్చినప్పుడు పచ్చిగా మాట్లాడతారు. రియల్ ఎమోషన్ క్యారీ అవ్వాలని పచ్చి మాటలు పెట్టాం. జెన్‌జీ జనరేషన్‌లో ఇవి కామన్. ఈ సినిమాకి ‘కూల్ రాకీ కూల్’ అని టైటిల్ పెట్టడానికి కారణం హీరో క్యారెక్టర్ మాక్సిమం ఫ్రస్ట్రేషన్‌లో ఉంటుంది. ఫ్రెండ్స్ ‘కూల్ రాకీ కూల్, ఎందుకు అంత టెన్షన్?’ అని చెబుతుంటారు. క్యారెక్టర్ పేరే రాకీ కాబట్టి ఆ డైలాగ్ ఎక్కువసార్లు రిపీట్ అవ్వడంతో టైటిల్గా పెట్టేశాను’ అని చెప్పారు.







కామెంట్‌లు (0)