Magazines

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ‘హనుమాన్‌ 2’

1 గంట క్రితం

Hanuman 2
avatar
balaji

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

‘హనుమాన్’ యూనివర్స్ నుంచి మరో ఫాంటసీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తమ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ కొత్త ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ పేరుతో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్నారు. ఫాంటసీ కథలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ కథాంశం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న ప్రపంచం, పాత్రల గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీని టైటిల్ పెంచుతుంది. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్‌ త్వరలోనే ప్రకటించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్