Monday, April 13, 2026
E-PAPER
Homeఆటలుసినర్‌ అదిరెన్‌

సినర్‌ అదిరెన్‌

- Advertisement -

టైటిల్‌తో పాటు వరల్డ్‌ నం.1 సొంతం
ఏటీపీ మోంటె కార్లో మాస్టర్స్‌

హాక్యూబ్రూన్‌ (ఫ్రాన్స్‌) : ఇటలీ స్టార్‌ జానిక్‌ సినర్‌ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానం అందుకున్నాడు. మోంటో కార్లో మాస్టర్స్‌ చాంపియన్‌గా నిలిచిన జానిక్‌ సినర్‌ ఏటీపీ మాస్టర్స్‌ టైటిల్స్‌లో హ్యాట్రిక్‌ కొట్టాడు. ఆదివారం జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లో కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌)పై 7-6(7-5), 6-3తో జానిక్‌ సినర్‌ సూపర్‌ విజయం సాధించాడు. అల్కరాస్‌ను ఓడించి టైటిల్‌ సాధించిన సినర్‌.. అతడి నుంచి వరల్డ్‌ నం.1 ర్యాంక్‌ను సైతం లాగేసుకున్నాడు. అల్కరాస్‌ 3 ఏస్‌లు, 2 బ్రేక్‌ పాయింట్లు సాధించాడు. తొలి సెట్లో ఆఖరు వరకు రేసులో నిలిచాడు. టైబ్రేకర్‌లో ఆధిక్యం సాధించిన సినర్‌ తొలి సెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. 3 బ్రేక్‌ పాయింట్లు సాధించిన సినర్‌.. రెండో సెట్‌ను 6-3తో సొంతం చేసుకుని ఆధిపత్యం చూపించాడు. పాయింట్ల పరంగా 88-79తో సినర్‌ పైచేయి సాధించాడు. ఈ ఏడాది వరుసగా మూడో మాస్టర్స్‌ టైటిల్‌ సాధించిన సినర్‌.. ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌లో వరుసగా 22 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి రికార్డు నెలకొల్పాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -