Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంసర్‌ ఎఫెక్ట్‌

సర్‌ ఎఫెక్ట్‌

- Advertisement -

6.5 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగింపు

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)లో భాగంగా ప్రచురించిన తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి 6.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. అక్టోబర్‌ 27న ప్రారంభమైన సర్‌ రెండో దశకు ముందు.. 12 రాష్ట్రాలు ,యూటీల లో 50.90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ప్రత్యేక ముసాయిదా జాబితాలు ప్రచురించాక ఓటర్ల సంఖ్య 44.40 కోట్లకు తగ్గింది. సర్‌ ప్రక్రియ అమలులో ఉన్న రాష్ట్రాలు, యూటీలలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో గణన ఫారమ్‌ల సేకరణ చాలా తక్కువగా ఉన్నదని అధికారులు వెల్లడించారు. సర్‌ రెండో దశ నవంబర్‌ 4న అండమాన్‌ , నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పుదుచ్చేరి, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ , పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైంది. అసోంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ పురోగతిలో ఉంది. డిసెంబరు 9న ముసాయిదా సర్‌ జాబితాను విడుదల చేయనున్నట్టు సీఈసీ వెల్లడించింది. ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -