Thursday, January 8, 2026
E-PAPER
Homeజాతీయంయూపీలో సర్‌ ఎఫెక్ట్‌

యూపీలో సర్‌ ఎఫెక్ట్‌

- Advertisement -

– 2.89 కోట్ల మంది పేర్లు తొలగింపు
– లక్నోలో అత్యధికొం డ్రాఫ్ట్‌ జాబితా విడుదల చేసిన ఈసీ
న్యూఢిల్లీ :
ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్‌) ప్రభావం భారీగా పడింది. సర్‌ తరువాత సుమారు 3 కోట్ల మంది ఓటర్లను ఈసీ తొలగించింది. సర్‌ 2 కోసం మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన గడువు కన్నా ఉత్తరప్రదేశ్‌లో అదనంగా 15 రోజుల వ్యవధిని ఈసీ ఇచ్చింది. రెండు పర్యాయాలు సర్‌ గడువును పొడించారు. తాజాగా సర్‌ ప్రక్రియ పూర్తి చేసిన ఎన్నికల కమిషన్‌ మంగళవారం డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం సర్‌ తరువాత 2.89 కోట్ల మంది పేర్లను ఈసీ తొలగించింది. అత్యధికంగా రాజధాని లక్నోలో 12 లక్షల మంది (30 శాతం) ఓటర్ల పేర్లు తొలగించారు. సర్‌కు ముందు ఇక్కడ 39.9 లక్షల మంది ఓటర్లు ఉండగా, డ్రాఫ్ట్‌ జాబితాలో ఈ సంఖ్య 27.9 లక్షలకు పడిపోయింది. సకు ముందు ఉత్తరప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో మొత్తంగా 15.44 కోట్ల మంది పేర్లు ఉండేవి. మరణాలు, శాశ్వత వలసలు, ఒకటి చోట కంటే ఎక్కువ ప్రదేశాల్లో నమోదులు వంటి కారణాలతో 2.89 కోట్ల మంది పేర్లు తొలగించినట్టు ఉత్తరప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్‌ రిన్వా తెలిపారు. 12.55 కోట్ల మంది పేర్లు డ్రాఫ్ట్‌ జాబితాలో అలాగే ఉంచినట్లు నవదీప్‌ రిన్వా వెల్లడించారు. మరణాల కారణంగా 46 లక్ష మంది పేర్లు, శాశ్వత వలసల కారణంగా 2.17 కోట్ల మంది పేర్లు, ఒకటి చోట కంటే ఎక్కువ ప్రదేశాల్లో నమోదు కారణంగా 25.47 లక్షల మంది పేర్లు తొలగించినట్టు నవదీప్‌ రిన్వా వివరించారు. ఈ డ్రాఫ్ట్‌ జాబితాను ఓటర్లకు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. ఈసీఐఎన్‌ఈటీ, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఈ డ్రాప్ట్‌ జాబితాను పరిశీలించి, ఓటర్లు తమ పేరు ఉందో.. లేదో ..తెలుసుకోవచ్చనని చెప్పారు. ఒకవేళ ఎవరి పేరైనా లేకపోయినా.. వివరాల్లో తప్పిదాలు కనిపించినా.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. ఈ జాబితాపై క్లెయిమ్‌లు, ఫిర్యాదులు, అభ్యంతరాల కోసం ప్రత్యేక విభాగాన్ని మంగళవారం నుంచే ప్రారంభించామని తెలిపారు. ఫిబ్రవరి 6 వరకూ వీటిని స్వీకరిస్తామని చెప్పారు. వీటిని పరిష్కరించిన తరువాత మార్చి 6న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. కాగా, సర్‌ 2 దశను ఛత్తీస్‌గడ్‌, గోవా, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిలతో పాలు సమానంగానే ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ ప్రక్రియను ప్రారంభించారు. అయితే యూపీ మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిసెంబరు 11న సర్‌ ప్రక్రియ ముగిసింది. డ్రాఫ్ట్‌ జాబితాలను ఇప్పటికే విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -