– తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ
– బెంగాల్ ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికేనా అంటూ మండిపాటు
కోల్‌కతా : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విచారణకు హాజరుకావాలని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌కూ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే టీమ్ ఇండియా పేసర్ మహమ్మద్ షమి, తణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటుడు దేవ్‌కు ఈసీ నోటీసులు ఇవ్వడంపై తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఇదంతా బెంగాల్ ప్రజలను లక్ష్యంగా చేసుకోవడమేనని దుయ్యబట్టారు. ”ఇది తీవ్ర విచారకరం. వారు అమర్త్యసేన్‌కూ నోటీసులు పంపారు. ఆయన ఒక నోబెల్ గ్రహీత. దేశం గర్వించదగ్గ వ్యక్తిని విచారణకు ఎలా పిలుస్తారు? ప్రపంచకప్‌లో దేశం తరఫున ఆడిన షమికి, ప్రముఖ నటుడు దేవ్‌కు వారు నోటీసులు పంపారు. ఇది వేధింపుల కిందికే వస్తుంది. సర్ పేరుతో బెంగాల్ ప్రజలను బీజేపీ-ఈసీ లక్ష్యంగా చేసుకున్నాయి” అని అభిషేక్ ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌కూ ‘సర్’ నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



