- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట పట్టణ కేంద్రంలో శాంతిభద్రతలు మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో గ్రామ ప్రధాన కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్యలు చేపట్టినట్టు ఎస్సై రాజు, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్‌లు నూతనంగా కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన స్థలాలను పరిశీలించారు. గ్రామంలో నేరాలను నియంత్రించి ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెరుగుతుందని అన్నారు.
- Advertisement -


