- Advertisement -
హుస్నాబాద్ ఏపిఎం బి. తిరుపతి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మహిళలు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు తప్పనిసరి నాటాలని హుస్నాబాద్ ఏపిఎం బబ్బురు తిరుపతి అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో మహిళా సంఘం విఓ మీటింగ్ నిర్వహించారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు జామ ,దానిమ్మ, నిమ్మ ,అల్లనేరేడు, మునగ చెట్టు మహిళా సంఘ సభ్యులకు ఏపిఎం పంపిణీ చేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని ఏపిఎం తిరుపతి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రసాద్, సిసి అశోక్, అంగన్వాడీ టీచర్ పద్మ, ఆశా వర్కర్ రమా, ఫీల్డ్ అసిస్టెంట్ నందయ్య, వివో ఏ సుదర్శన్ , మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -