నవతెలంగాణ – బాల్కొండ
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో డిస్టిక్ ప్రెసిడెంట్ బోయిని శ్రీధర్ ఆధ్వర్యంలో సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా చేసే కార్యక్రమాల బ్యానర్ మంగళవారం బాల్కొండ ఎస్ఐ శైలేందర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా సంస్థ ద్వారా చేస్తున్న అవగాహన సదస్సుల గురించి ఎస్ఐ కి వారు వివరించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ శైలందర్ మాట్లాడుతూ.. నేటి యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాల బారిన పడి విలువైన జీవితాలు కోల్పోతున్నారని అన్నారు.
ఎవరైనా సమాజానికి, ప్రజలకు హాని కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎస్. జె. డబ్ల్యూ. హెచ్. ఆర్. సి ప్రతినిధులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం అని ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ బోయిని శ్రీధర్, జిల్లా పి ఆర్ ఓ గాదరి లింగం, జిల్లా డైరెక్టర్ కూనింటి ముత్తెన్న, జిల్లా కల్చరల్ అండ్ హెరిటేజ్ సెల్ చైర్మన్ శ్రావణ్ వెల్మల్, ఆర్మూర్ నియోజకవర్గ డైరెక్టర్ బండి ముత్తెన్న, సభ్యులు కిషన్ తదితరులు పాల్గొన్నారు.



