నవతెలంగాణ – అశ్వారావుపేట: ప్రతీ విద్యార్ధి చదువుతో పాటు ఇతర ఏదో ఒక నైపుణ్యం కలిగి ఉండాలని, పాఠ్యాంశాలతో పాటు ఇతర నైపుణ్యాలను కూడా సంపాదించుకోవాలిఅని, అపుడే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ విద్యార్థుకు సూచించారు. మంగళవారం హైదరాబాద్ కు చెందిన ఇక్క ఫౌండేషన్ ఆద్వర్యంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇక్క ఫౌండేషన్ వ్యస్థాపక అధ్యక్షులు కిషోర్ పిల్లలకు నైపుణ్య శిక్షణను అందించారు. కళాశాల ఎస్సి ఎస్టీ సెల్ బాధ్యులు ప్రొఫెసర్ కే.కోటేశ్వర్రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు. ఈ ఒక్క రోజు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇతర బోధనా సిబ్బంది ప్రొఫెసర్స్ ఎం.రాంప్రసాద్,ఐ.కృష్ణ తేజ, ఆర్.రమేష్ పాల్గొన్నారు.
నైపుణ్యాభివృద్ది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది: ఏడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES