Friday, March 6, 2026
E-PAPER
Homeమానవిశనగపిండితో చర్మ సంరక్షణ

శనగపిండితో చర్మ సంరక్షణ

- Advertisement -

శనగపిండి చర్మ సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలు వంటి అనేక చర్మ సమస్యలకు బాగా పనిచేస్తుంది. సెబమ్‌ జిడ్డు ఉత్పత్తిని నియంత్రిస్తుంది. చర్మాన్ని అందంగా, కాంతివంతంగా చేస్తుంది. అవాంఛిత రోమాలను తొలగించడంలోనూ సహాయపడుతుంది. శనగపిండికి ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను కలిపితే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. ఒక్కో స్పూన్‌ చొప్పున శనగపిండి, కలబంద గుజ్జును కలిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.

ముఖంపై వచ్చే నల్లని మచ్చలు తగ్గుతాయి. రెండు టీస్పూన్ల శనగపిండి, చిటికెడు పసుపు, కొద్దిగా రోజ్‌వాటర్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవాళ్లు దీనికి మజ్జిగ మీగడ కలుపుకుంటే చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. రెండు టేబుల్‌ స్పూన్ల శనగపిండి, బాగా పండిన టమోటా రసాన్ని తీసుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి. దీనిని ముఖానికి రాసుకొని 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ మిశ్రమం చర్మంపై ఉండే నల్లని మచ్చలను తగ్గిస్తుంది.

పిహెచ్‌ స్థాయిలను సమతుల్యం చేసి జిడ్డును తగ్గిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. శనగపిండికి తగినంత పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ మిశ్రమం చర్మంపై ఉండే జిడ్డును, మృత కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. గుడ్డులోని తెల్లసొన, శనగపిండి కలిపిన మిశ్రమానికి కొంచెం తేనె కలిపి ముఖానికి అప్లయి చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మ రంధ్రాలను బిగించి, ముడతలను తగ్గిస్తుంది. చర్మ కణాల పునర్నిర్మాణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -