Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ..

విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
తిమ్మాజిపేట మండలంలోని పొతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు స్నాక్స్ పంపిణీ చేశారు. సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు జి చంద్రమోహన్ మాట్లాడుతూ ..ఎస్ఎస్సి పరీక్షాల ప్రత్యేక తరగతుల నేపథ్యంలో సాయంత్రం వేళ ఉచిత చిరుతిళ్లు (స్నాక్స్) అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్నాక్స్ 19 రోజులపాటు సాయంత్రం వేళ ప్రతి విద్యార్థికి ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, శనగలు, పప్పులు, అరటి పండ్లు వంటివి అందిస్తున్నట్లు తెలిపారు. ఇవి విద్యార్థులకు అందివ్వడం ద్వారా సుదీర్ఘ సమయం పాఠశాలలో ఉండే విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడం వారి ఏకాగ్రతను పెంచడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కురుమయ్య, వెంకటస్వామి, ప్రశాంత్ కుమార్, శ్రీలక్ష్మి, నారాయణ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -