తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రతి ఊరికి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్పాన్ని తీసుకెళ్లాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సమాజంలో అత్యధిక జనాభా అట్టడుగున బతకాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో, స్వతంత్ర భారత దేశంలో ఇప్పటికీ సమానత్వం ఎందుకు అందని ద్రాక్షగా మారిందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు. మొదటి దశలో అన్ని మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత ప్రతి గ్రామంలో సభలుంటాయని తెలిపారు. పార్టీ ప్రధాన ఎజెండా అయిన పాంచజన్య పథకాలను ప్రతి గడపకు చేర్చాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణను సుసంపన్నం చేసుకునేందుకు రాష్ట్ర సాధన ఉద్యమం తరహాలో మళ్లీ ఉద్యమించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ప్రతి ఊరికి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప స్ఫూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



