Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఓలా ఎలక్ట్రిక్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ వాటా తగ్గింపు

ఓలా ఎలక్ట్రిక్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ వాటా తగ్గింపు

- Advertisement -
  • 2.15 శాతం వాటా విక్రయం
    బెంగళూరు : ద్విచక్ర విద్యుత్‌ వాహనాల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ 2.15 శాతం వాటాలను విక్రయించింది. దీంతో సాఫ్ట్‌బ్యాంక్‌ తన హోల్డింగ్‌ వాటాను 17.83 శాతం నుంచి 15.68 శాతానికి కుదించుకుందని ఓలా ఎలక్ట్రిక్‌ గురువారం రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. జూలై 15 నుండి సెప్టెంబర్‌ 2 మధ్య జరిగిన వరుస విక్రయాల్లో ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌లోని కొన్ని ఈక్విటీ షేర్లను విక్రయించిందని పేర్కొంది. 2025 జూన్‌ 30 నాటికి ఓలా ఎలక్ట్రిక్‌లో సాఫ్ట్‌ బ్యాంక్‌ 17.83 కోట్ల షేర్లను కలిగి ఉంది. ఇది 78.65 కోట్ల ఈక్విటీ షేర్లలో 17.83 శాతం వాటాకు సమానం. మార్కెట్ల ముగింపునకు కొద్ది సేపు ముందు ఓలా ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్‌ షేర్లు 7 శాతం పతనమై రూ.64.49 వద్ద ముగిశాయి. 350సిసి లోపు ఇంజన్‌ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలపై జిఎస్‌టిని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం ఓలా ఎలక్ట్రిక్‌ షేర్లపై ఒత్తిడిని పెంచింది.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad