Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సమీకృత జిల్లా కార్యాలయానికి సోలార్ విద్యుత్..

సమీకృత జిల్లా కార్యాలయానికి సోలార్ విద్యుత్..

- Advertisement -

అన్ని కార్యాలయంలో సోలార్ తోనే విద్యుత్ సరఫరా..
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ నీ వినియోగించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సోలారైజషన్ చేయడంలో భాగంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనానికి సోలార్ విద్యుత్తును వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కి వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు.

2023 లోనే సూర్యాపేట ఐ డి ఓ సి రూఫ్ టాప్ పై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా ప్రతిరోజు 372 కిలో వాట్ల విద్యుత్ జనరేట్ అవుతున్నదని తెలిపారు.ఈ విద్యుత్తు ను సమీకృత జిల్లా అధికారుల కార్యాలయం లోని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నామని,కార్యాలయాలకు అవసరమైన విద్యుత్ డిమాండ్ ను తీర్చగలుగుతున్నదని వెల్లడించారు.దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇదివరకె సోలార్ సిస్టం అమలు చేస్తున్న జిల్లాలు ఇందుకు సంబంధించి సోలార్ ప్యానల్స్ చిత్రాలను, పూర్తి వివరాలతో సమాచారాన్ని పంపించాలని కోరారు.రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలారైజషన్ కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని, ఇందులో భాగంగానే గ్రామపంచాయతీ మొదలుకొని సెక్రటేరియట్ వరకు అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు.

ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల వారీగా పూర్తి వివరాలను నిర్దేశించిన ప్రొఫార్మాలో పూర్తి చేసి ఈ నెల 18 లోగా పంపించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు, అన్ని ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో పంపాలన్నారు.అలాగే ఖాళీ ప్రభుత్వ స్థలాలు వివరాలను సైతం పంపించాలని డిప్యూటీ సి ఎం చెప్పారు.నల్లమల డిక్లరేషన్ లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 6,70,000 ఎకరాల అటవీభూములకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు నిర్ణయించడం జరిగిందని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తయారు చేసి వారంలోగా పంపించాల్సిందిగా ఆదేశించారు. మూడేళ్లలో ఈ భూములన్నింటికీ సోలార్ విద్యుత్తును రెడ్ కో ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల సోలారైజేషన్ కు సంబంధించిన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ప్రభుత్వ ప్రాధాన్య పథకాలలో ఒకటిగా తీసుకొని జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి వివరాలను పంపించాలని, అలసత్వం ప్రదర్శించవద్దని చెప్పారు.

ఇరిగేషన్ శాఖకు సంబంధించి అన్ని ఖాళీ భూముల వివరాలు పంపించాలన్నారు. ఉదాహరణకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కెనాల్స్ కు ఇరువైపులా వాహనాలు వెళ్లే విధంగా స్థలాన్ని వదలడం జరిగిందని, కిలోమీటర్ల మేర స్థలం అందుబాటులో ఉంటుందని, అందువల్ల ఈ స్థలాలలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు పరిశీలించి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకుగాను వివరాలు పంపాలన్నారు. మండలంలో సుమారు 135 నుండి 140 వరకు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, వీటన్నిటిపై సర్వే నిర్వహించి పూర్తి సమాచారాన్ని పంపించాలని కోరారు.రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్, రెడ్ కో, సింగరేణి ఎం డి ,వి సి లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img