- Advertisement -
ఇజ్రాయిల్ మారణకాండపై ప్రజాగ్రహం
సారజేవో : బోస్నియాలో పాలస్తీయన్లకు మద్దతుగా అక్కడి ప్రజలు సంఘీభావ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇజ్రాయిల్ మారణకాండపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మేం కూడా ఇదే విధంగా యుద్ధ భయానక పరిస్థితులను ఎదుర్కొన్నాం. కాబట్టి గాజా ప్రజల పట్ల మాకు సానుభూతి ఉంది’ అని గళమెత్తారు. ప్లకార్డులు, బ్యానర్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తక్షణమే ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపాలని, అమాయకుల ప్రాణాలు కాపాడే విధంగా ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -