Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగామలో నీటి సమస్యకు పరిష్కారం 

జనగామలో నీటి సమస్యకు పరిష్కారం 

- Advertisement -

– బోరు మోటార్ల ఏర్పాటు
నవతెలంగాణ – కామారెడ్డి 

బీబీపేట మండలం జనగామ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బుధవారం బోరు మోటార్లను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఒకటో వార్డు, రెండో వార్డు తదితర వార్డుల్లో నీటి సరఫరా మెరుగుపర్చేందుకు మోటార్లను బిగించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  బీబీపేట మండల పరిషత్ మాజీ ఎంపీపీ పి. రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ పాత స్వామి, వార్డు సభ్యులు నరసింహ చారి, బేలె రాజబాబు, కొల్లూరి రాజలింగం, బెల్లి వంశీ, రమేష్ లతో పాటు గ్రామస్తులు డాకూరి రవి, పాత రవి, ఆకుల రములు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా ప్రజలకు నిరంతరంగా నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -