Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఐకేపీ వీఓఏల సమస్యలు పరిష్కరించండి

ఐకేపీ వీఓఏల సమస్యలు పరిష్కరించండి

- Advertisement -

– సెర్ప్‌ సీఈఓకు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఐకేపీ వీఓఏల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌కు ఆ యూనియన్‌ బృందం వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు రాజ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ, కార్యనిర్వాహక అధ్యక్షులు వి.సుధాకర్‌, ఉపాధ్యక్షులు ఎం.నగేశ్‌, వి.సుధాకర్‌, వెంకటయ్య, చంద్రలీల, రాష్ట్ర కార్యదర్శులు రమేశ్‌, దుర్గయ్య, అరుణ, కోశాధికారి సుమలత, రాష్ట్ర నాయకులు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వీ.రమ, రాజ్‌కుమార్‌ పలు సమస్యలను సెర్ప్‌ సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. రూ.20 వేతనం ఇవ్వాలనీ, బకాయిపడ్డ స్త్రీ నిధి ఇన్సెంటీవ్‌లను వెంటనే గ్రామ సంఘాలకు చెల్లించాలని విన్నవించారు. ప్రతి గ్రామ సంఘానికీ ట్యాబ్‌, నెట్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రామ సంఘాల నుంచి ఐకేపీ వీఓఏలకు రావాల్సిన రూ.3 వేల ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. మూడు నెలలకోసారి వీఓఏలను రెన్యూవల్‌ చేసే పద్ధతికి స్వస్తి చెప్పి రెండేం డ్లకోసారి రెన్యూవల్‌ చేయాలని సూచించారు. అర్హులైన వారిని సీసీలుగా పదోన్నతి కల్పించాలనీ, సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ మాట్లా డుతూ…త్వరలో ట్యాబ్‌ అందిస్తామనీ, నెట్‌ సౌకర్యం కల్పిస్తామని హామీనిచ్చారు. మిగతా సమస్యలు వారం లోగా పరిష్కరిస్తామనీ, విధానప రమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని భరోసానిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -