- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మరోసారి ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆమెను.. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రసిద్ధ సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సోనియా గాంధీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
- Advertisement -



