- Advertisement -
ఢిల్లీ కాలుష్యంతో అస్వస్థత
ఆరోగ్యం నిలకడగానే ఉంది : వైద్యులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. నగరంలో కాలుష్యం పెరగడంతో ఆమె చాలా రోజులుగా దగ్గుతో బాధ పడుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రొటీన్ చెకప్‌లో భాగంగానే సోనియా ఆస్పత్రిలో చేరినట్టు తెలిపాయి. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
- Advertisement -



