లోకం మంచి చెడుల చిగురులన్నింటి
రుచి తెలిసినా సాదు జీవి
ఉదయము ప్రపంచాన్ని చూపించే పత్రికలలో
పంచప్రాణాలలో ఒక ప్రాణమైతడు
ఒక్కొక్క దగ్గర అజీర్ణంతో సతమతమౌతడు
ఒక్కొక్క దగ్గర నవ్వులై పూస్తడు
చింతిస్తడు, దుఃఖిస్తడు, భరిస్తడు
మంటలై రగిలిపోతడు
చిన్నపిల్లాడయి లోకమంతా దోగాడుతడు
మట్టిలో మొలుస్తడు, ఆకాశంలో తేలుతడు
నీటి బిందువు అంచును పట్టుకొని
నేలలో కురుస్తడు
అందరికి అన్నీ ఇవ్వాలని తహతహలాడుతడు
బాధలన్నింటినీ పెన్నుతో పెకిలిస్తడు
వాడిపోయిన లోకాన్ని ఓదార్చుతడు
ఊపిరిని పేపర్‌పై పోసి మొలకల కోసం ఎదురు చూస్తడు
ఆలోచన టార్చ్ లైట్ వేసుకుని చీకటిని వెతుకుతుంటడు
మనుషులంటే ఎన్నటికీ తెగిపోని ప్రేమ
మనుషుల సంబంధాలను క్యూరింగ్ చేస్తుంటడు
దాగి ఉన్న కొత్త లోకం చూపిస్తడు
మార్మికం తప్పులను ఎరిగి అగ్గిపై గుగ్గిలమైతడు
ఉదయమై అందరి హృదయాలలో
పూయాలని లోకం ఈతి బాధలన్నీ
పెన్నులో సిరాగా పోసుకొని రాస్తుంటడు.
గుండెల్లి ఇస్తారి, 9849983874
పారదర్శకుడు
12 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)