Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్జొన్న రైతుల ఆందోళన ..

జొన్న రైతుల ఆందోళన ..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్: పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేశారు. మండలంలోని వందల ఎకరాల్లో జొన్న సాగు చేసిన రైతులు గత 20 రోజుల ముందు ప్రారంభమైనా.. జొన్న కొనుగోలు సమయానికి తూకం వేసేందుకు సంచులు లేకపోవడంతో జొన్న కుప్పల వద్దనే రాత్రి పగలు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ప్రభుత్వం  కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దళారులకు అందే సంచులు చిన్న సన్నకారు రైతులకు అందడం లేదని అన్నారు. జొన్నలు కాంటలు కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని దళారులు పెరిగిపోవడంతో దళారులకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వట్లేదని సహకార సంఘం  చైర్మన్ చాంబర్ ముందు ఆందోళన చేశారు. మాకు సకాలంలో సంచులు అందించి జొన్నలు కొనుగోలు చేయాలని సహకార సంఘం చైర్మన్ తో వాగ్వాదానికి దిగారు. దీనితో సహకార సంఘం చైర్మన్ హనుమంత్ రెడ్డిని ప్రశ్నించగా.. సంచులు రాకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని, ఎటువంటి దళారులకు కూడా సంచులను ఇవ్వటం లేదని, ఆన్లైన్లో పొందుపరిచిన వారికి మాత్రమే  సంచులను ఇస్తున్నామని అన్నారు. పై అధికారులకు బార్ధాన్ కావాలని, గత కొన్ని రోజులుగా కోరుతున్నా.. పై అధికారులు విడుదలవారీగా సంచులు ఇస్తున్నారని, ఇప్పటివరకు పెద్దకొడప్ గల్ సహకార సంఘానికి 1లక్ష 6000 వేళ్ళ బస్తాలు వచ్చాయని తెలిపారు. 70 వేల బస్తాలను తూకం వేసామని, తూకానికి వాతావరణం సహకరించక ఈ సమస్య తలెత్తుతుందని  అన్నారు. సకాలంలో అందరి జొన్నలు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -