– నియోజకవర్గం వ్యాప్తంగా 58.42 శాతం పూర్తి
– వేగవంతం చేయాలని తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ బీఎల్వోలు కు ఆదేశం
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ ఈ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా నేటికి సవరణ ప్రక్రియ 58.42 శాతం పూర్తైనట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు లోపు లక్ష్యాన్ని సాధించాలని, బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పనిని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
సమీక్షలో మండలాల వారీ పురోగతిని వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి:
చండ్రుగొండ – 67.11%
ములకలపల్లి – 66.47%
అన్నపురెడ్డిపల్లి – 59.27%
అశ్వారావుపేట – 54.74%
దమ్మపేట – 52.18%
అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడం, తప్పిదాలను సరిదిద్దడం, డూప్లికేట్లు తొలగించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ హుస్సేన్, ఆర్ఐ పద్మావతి లు పాల్గొన్నారు.



