నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్యం పై నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. గ్రామంలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచే లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రత గ్రామంగా నిలిపేందుకు ప్రైవేట్ వ్యక్తులతో గత కొద్దిరోజులుగా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. గ్రామంలోని ఏ కాలనీలో కూడా చెత్త పేరుకు పోకుండా, మురికి కాలువలు శుభ్రంగా ఉండేలా తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కమ్మర్ పల్లి గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న పారిశుధ్యం పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలను ఉప సర్పంచ్ అశోక్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
కొనసాగుతున్న పారిశుద్ధ్యం పనులపై స్పెషల్ డ్రైవ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



